22 ప్రమాణాలు — నాగ్‌పూర్, 14 అక్టోబర్ 1956
నాగ్‌పూర్‌లో, హిందూ మతాన్ని విడిచిపెట్టి, బౌద్ధమతాన్ని 14 అక్టోబర్ 1956న స్వీకరించిన తర్వాత, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ తన అనుచరులకు 22 ప్రమాణాలను సూచించాడు.
- నేను బ్రహ్మ విష్ణు మహేశ్వరులను దేవుళ్ళుగా భావించను, వాళ్ళను పూజించను.
- నేను రాముడు, కృష్ణుణ్ణి దేవుళ్ళు అనను, వారిని పూజించను.
- నేను గౌరీ, గణేశులను మరి ఏ ఇతర హిందూ దేవుళ్ళను పూజించను.
- నాకు దేవుని అవతారం మీద నమ్మకం లేదు.
- బుద్ధుడు విష్ణువు యొక్క అవతారం అనడం తప్పు, ద్వేషపూరితం.
- నేను శ్రార్థ కర్మలు గానీ పిండ ప్రదానం గానీ చేయను.
- నేను బుద్ధుని బోధనలకు విరుద్ధంగా ఉండే ఏ ఒక్క అంశాన్ని పాటించను.
- నేను బ్రాహ్మణుల ఆచారాలను పాటించను.
- నేను మానవులంతా సమానమని నమ్ముతాను.
- నేను సమానత్వ స్థాపనకు కృషి చేస్తాను.
- నేను అష్టాంగ మార్గాన్ని ఆచరిస్తాను.
- నేను బుద్ధుడు చెప్పిన దశ పారమితులను ఆచరిస్తాను.
- నేను సమస్త జీవుల పట్ల దయ కలిగి ఉంటాను.
- నేను దొంగతనం చేయను.
- నేను అబద్ధాలు చెప్పను.
- నేను ఎటువంటి లైంగిక దుర్మార్గాలకు పాల్పడను.
- నేను మద్యం సేవించను.
- నేను జ్ఞానం, నీతి, దయలపై ఆధారపడిన సూత్రాలతో జీవిస్తాను.
- మనుషులను సమానంగా చూడని, నా ఎదుగుదలకు హానికరమైన హిందూ మతాన్ని బహిష్కరించి, బుద్ధుని ధర్మాన్ని అనుసరిస్తాను.
- నేను బుద్ధుని ధర్మం మాత్రమే సరైనదని ఒప్పుకుంటున్నాను.
- నేను కొత్తగా జన్మిస్తున్నానని నమ్ముతున్నాను.
- నేను ఇప్పటినుండి బుద్ధుని బోధనలకు అనుగుణంగా నడుచుకుంటాను.
The 22 Vows — Nagpur, 14 October 1956
In Nagpur, after leaving the Hindu religion and accepting Buddhism on 14th October 1956, Dr. Babasaheb Ambedkar prescribed 22 vows to his followers.
- I shall have no faith in Brahma, Vishnu and Mahesh nor shall I worship them.
- I shall have no faith in Rama and Krishna who are believed to be incarnation of God nor shall I worship them.
- I shall have no faith in 'Gauri', Ganapati and other gods and goddesses of Hindus nor shall I worship them.
- I do not believe in the incarnation of God.
- I do not and shall not believe that Lord Buddha was the incarnation of Vishnu. I believe this to be sheer madness and false propaganda.
- I shall not perform 'Shraddha' nor shall I give 'pind-dan'.
- I shall not act in a manner violating the principles and teachings of the Buddha.
- I shall not allow any ceremonies to be performed by Brahmins.
- I shall believe in the equality of man.
- I shall endeavour to establish equality.
- I shall follow the 'noble eightfold path' of the Buddha.
- I shall follow the 'paramitas' prescribed by the Buddha.
- I shall have compassion and loving kindness for all living beings and protect them.
- I shall not steal.
- I shall not tell lies.
- I shall not commit carnal sins.
- I shall not take intoxicants like liquor, drugs etc.
- I shall endeavour to follow the noble eightfold path and practise compassion and loving kindness in every day life.
- I renounce Hinduism which is harmful for humanity and impedes the advancement and development of humanity because it is based on inequality, and adopt Buddhism as my religion.
- I firmly believe the Dhamma of the Buddha is the only true religion.
- I believe that I am having a re-birth.
- I solemnly declare and affirm that I shall hereafter lead my life according to the principles and teachings of the Buddha and his Dhamma.